Allu Arjun: కొరటాల శివ దర్శకత్వంలో అల్లు అర్జున్ మూవీ..! 3 d ago
పుష్ప 2 తో స్టార్ హీరో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా మంచి నటుడని నిరూపించుకున్నాడు. దీంతో అల్లు అర్జున్ తో మూవీ చేసేందుకు చిత్రనిర్మాతలు క్యూ కడుతున్నారు. తాజాగా దర్శకుడు కొరటాల శివ కూడా అల్లు అర్జున్ ని కలిసి ఒక స్టోరీ లైన్ చెప్పినట్లు సమాచారం. స్టోరీ లైన్ నచ్చడం తో పూర్తి కథ రెడీ చేసి చెప్పమని బన్నీ కోరినట్లు తెలిసింది. దీంతో కొరటాల శివ స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో ఉన్నట్లు సమాచారం.